కొత్త ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ ప్రారంభం
KKD: తోండంగి మండలం వలసపాకలి గ్రామంలో కొత్తగా ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ ప్రారంభమైంది. రిబ్బన్ కట్ కార్యక్రమంతో ఈ ఏజెన్సీని అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ల కోసం గ్రామస్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. కొత్త ఏజెన్సీ ప్రారంభంతో ఆ ఇబ్బందులు తొలగనున్నాయి.