ఒళ్లు విరవడం ఆరోగ్యానికి మంచిదే.. కానీ!
ఏదైనా పని పూర్తవగానే అప్రయత్నంగానే ఒళ్లు విరుస్తుంటాం. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదే అని నిపుణులు చెబుతున్నారు. ఒళ్లు విరవడం వల్ల కండరాల సడలింపుతో పాటు జాయింట్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా రక్తప్రసరణ, మెదడు పనితీరు మెరుగుపడి హుషారు పెరుగుతుంది. కానీ తరచూ చేయడం మంచిది కాదని, చేస్తే దీర్ఘకాలంలో జాయింట్స్ స్థిరత్వం తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు.