మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ ర్యాలీ

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ ర్యాలీ

KRNL: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేట్‌పరం చేయడాన్ని నిరసిస్తూ కర్నూలులో వైసీపీ ర్యాలీ నిర్వహించింది. సోమవారం మంత్రాలయం నియోజకవర్గం నుంచి వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పురుషోత్తం రెడ్డి ర్యాలీని ప్రారంభించారు. పీపీపీ విధానం రద్దయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని నాయకులు తెలిపారు.