'బస్సు సౌకర్యం కల్పించాలి'

'బస్సు సౌకర్యం కల్పించాలి'

HNK: కమలాపురం మండలం మాదన్నపేట గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం నేత కత్తి రమేష్ పరకాల డిపో మేనేజర్‌కు ఇవాళ వినతిపత్రం సమర్పించారు. గ్రామస్థులు నిత్యం పరకాల, హనుమకొండకు వెళ్తున్నారని, పరకాల నుంచి శనిగరం మీదుగా హనుమకొండకు బస్సు మంజూరు చేయాలని కోరారు. ఆర్టీసీ ప్రజా రవాణా కోసం చర్యలు తీసుకొని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.