గ్రీవెన్స్ కోసం కాల్ సెంటర్ ఏర్పాటు: కలెక్టర్

నెల్లూరు తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. అర్జీల పరిష్కార సమాచారం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.