ప్రమాదాల నివారణకు సహకరించాలి: కలెక్టర్
NZB: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ‘అరైవ్-అలైవ్’లో భాగంగా ఆర్మూర్ మండలం పిప్రి గ్రామసభలో ఆమె పాల్గొన్నారు. ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడేందుకు 9 మందితో 'రోడ్ సేఫ్టీ కమిటీ'ని ఏర్పాటు చేశారు. క్షతగాత్రులను ఆదుకున్న వారికి రూ.25 వేల ప్రోత్సాహకం అందిస్తామని కలెక్టర్ ప్రకటించారు.