తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. వాణిజ్య సిలిండర్ ధరలను ఐదు రూపాయలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎల్పీజీ వాణిజ్య సిలిండర్(19 కేజీలు) ధర రూ.1595 ఉండగా.. తగ్గింపు ధరతో రూ.1590కి అందుబాటులోకి వస్తుంది. అయితే సబ్బడీ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.