మాజీ సీఎం నాదెండ్లకు డిప్యూటీ సీఎం సంతాపం
KKD: మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల డిప్యూటీ సీఎం పవన్ సంతాపం తెలిపారు. న్యాయవాదిగా, రాజకీయవేత్తగా ఆయనకు ఉన్న పరిజ్ఞానం ఎంతో విలువైనదని కొనియాడారు. నా సహచర మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పితృ వియోగం బాధ నుంచి త్వరగా కోలుకోవాలని కోరారు. మనోహర్, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.