నల్గొండలో నేపాల్ కుటుంబానికి సాయం

నల్గొండలో నేపాల్ కుటుంబానికి సాయం

NLG: పని నిమిత్తం భారత్‌కు వచ్చి, గత నాలుగు రోజులుగా నల్గొండ రైల్వే స్టేషన్లో ఆకలితో ఇబ్బందులు పడుతున్న నేపాల్‌కు చెందిన కుటుంబానికి బుధవారం ఓ సంస్థ అండగా నిలిచింది. ఆ సంస్థ సభ్యులు వారికి తక్షణమే ఆహారం అందజేసి ఆకలి తీర్చారు. అంతేకాక, వారు స్వదేశానికి వెళ్లేందుకు వీలుగా రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.