ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
NTR: విజయవాడ దుర్గమ్మ వారధిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు నుంచి విజయవాడ వైపు బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులను, వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.