రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

అనకాపల్లి పట్టణం పూడిమడక జంక్షన్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు ట్రాఫిక్ ఎస్ఐ శేఖరం తెలిపారు. ఓ సర్వీసింగ్ సెంటర్లో పనిచేస్తున్న బీశెట్టి గణేశ్ అప్పారావు (26) ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా వాహనం ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గణేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.