కొయ్యూరు మండలంలో 37 అంగన్వాడీ పోస్టులు
ASR: కొయ్యూరు మండలం పిట్టచలం, ములకలపాడు, గాముకొండ తదితర అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 37 ఆయా పోస్టుల భర్తీకి ధరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ సీడీపీవో ఎల్. దేవమణి మంగళవారం తెలిపారు. స్థానికంగా నివాసం ఉంటున్న, 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వివాహిత మహిళా అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు, ఏప్రిల్ నెల 1నుంచి 15లోగా ధరఖాస్తులు అందించాలన్నారు.