లైంగిక వేధింపుల కేసు.. సుప్రీం సంచలన తీర్పు

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ యూనివర్సిటీ వీసీపై వచ్చిన లైంగిక వేధింపుల కేసును విచారించిన సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సాంకేతిక కారణాల వల్ల పిటిషన్‌ను కొట్టివేసినప్పటికీ, తాను చేసిన తప్పు జీవితాంతం గుర్తుండేలా ఈ కేసు గురించి తన రెజ్యూమ్‌లో రాసుకోవాలని వీసీని ఆదేశించింది. ఈ ఆదేశం చాలా ప్రత్యేకమైనదిగా, చారిత్రాత్మకమైనదిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.