నేడు పలు ప్రాంతాలకు పవర్ కట్

నేడు పలు ప్రాంతాలకు పవర్ కట్

VZM: స్థానిక కంటోన్మెంట్‌ ఫీడర్లు పైన ఉన్న చెట్టు కొమ్మలను తొలగించే నిమిత్తం గురువారం విజయనగరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE త్రినాథరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు దుప్పాడ, చిల్లాపెట, జొన్నాడ, సారిక ప్రాంతాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.