VIDEO: మిషన్ భగీరథ పైపు లీక్

GDWL: గట్టు మండలం చమన్‌ఖాన్‌దొడ్డి గ్రామంలో నెట్టెంపాడు కాలువపై ఉన్న మిషన్ భగీరథ నీటి పైపు శనివారం లీక్ అయింది. దీని వల్ల నీరు బయటికి పొంగిపోతోందని, కింది గ్రామాలకు నీరు అందకుండా పోతుందని, నీటి కొరత సమస్య తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఈ సమస్యను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని స్థానికుల కోరారు.