VIDEO: ఆర్టీసీ డ్రైవర్ మృతి ప్రభుత్వ హత్యే: బండి సంజయ్
KNR: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, ఇది ముమ్మాటికీ "ప్రభుత్వ హత్యే" అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మొండి వైఖరి వీడి, సమ్మెలో ఉన్న 39 వేల మంది కార్మికులతో తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కార్మికులను బెదిరించడం మూర్ఖత్వమని, వారి సమస్యలను పరిష్కరించాలన్నారు.