రూ.2.5 లక్షల LOC మంజూరు చేసిన ఎమ్మెల్యే

రూ.2.5 లక్షల LOC మంజూరు చేసిన ఎమ్మెల్యే

KMR: లింగంపేట్ మండలం శెట్పల్లి సంగారెడ్డికి చెందిన పోలంపల్లి అనసూజ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా రూ.2,50,000 ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. ఈ ఆర్థిక సహాయం అందడంతో అనసూజ చికిత్సకు మార్గం సుగమమైంది. దీంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.