లొంగిపోయిన 10 మంది మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా 10 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిపై మొత్తం రూ.33 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని అమిత్ షా చేసిన ప్రకటన నేపథ్యంలో, భద్రతా బలగాలు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. దీంతో ఇటీవల కాలంలో భారీ సంఖ్యలో మావోలు అడవులను వీడి, జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు.