వెంకటాపురంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

VZM: గజపతినగరం పంచాయతీ శివారు ఎం. వెంకటాపురంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం గజపతినగరం మార్కెట్ కమిటీ అధ్యక్షుడు పీవీవీ గోపాలరాజు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలరాజు ఇంటింటికి వెళ్లి ఏడాదిలో చేపట్టిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో జరగనున్న కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు.