ఉపాధ్యాయురాలు డిప్యూటేషన్ రద్దు

ఉపాధ్యాయురాలు డిప్యూటేషన్ రద్దు

MNCL: భీమారంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను విద్యా శాఖ జిల్లా సెక్టోరియల్ అధికారి సత్యనారాయణ మూర్తి సందర్శించారు. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు ప్రమీలను రెడ్డిపల్లి పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీంతో ఆయన పాఠశాలను సందర్శించి డీఈఓ ఆదేశాలతో డిప్యూటేషన్ రద్దు చేస్తున్నట్లు తెలిపారు.