పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ
KMM: ఏన్కూరు పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఏసీపీ వసుంధర యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న పలు రికార్డులను ఏసీపీ పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ రేటు గురించి స్థానిక ఎస్సైను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.