భారతదేశ విజయాన్ని కోరుతూ వేద పఠనం

KMM: ఖమ్మం నగరం బ్రాహ్మణ బజారులో వేంచేసియున్న శ్రీ భ్రమరాంబికా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు పండితులు వేద పారాయణ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం దాయాది దేశానికి మనకు జరుగుతున్న యుద్ధంలో మనదేశం పరిపూర్ణ విజయం సాధించాలని పండితులు కోరుతున్నారు. ఖమ్మం పట్టణ పురోహిత సంఘ అధ్యక్షుడు మార్తి వీరభద్ర ప్రసాద్ శర్మ, సొలసా దుర్గా ప్రసాద్ ఉన్నారు.