రూ.12.54 లక్షల విలువైన కల్తీ బిస్కెట్లు సీజ్

రూ.12.54 లక్షల విలువైన కల్తీ బిస్కెట్లు సీజ్

HYDలోని కేడీకాలనీలో అక్రమంగా నిర్వహిస్తున్న బేకరీ యూనిట్‌పై గుడిమల్కాపూర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. లైసెన్స్ లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో తినుబండారాలు తయారు చేస్తున్న అహ్మద్ రజాను అనే వ్వక్తిని అరెస్ట్ చేశారు. సుమారు రూ.12.54 లక్షల విలువైన బిస్కెట్లు, రస్క్, బన్లను సీజ్ చేశారు. ఈ ఉత్పత్తులను స్థానిక హోటళ్లు, కేఫ్లకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.