తైపీ ఆర్చరీ ఓపెన్.. తెలుగు ఆర్చరకు కాంస్యం
తెలుగు ఆర్చర్ జ్యోతి సురేఖ మరో మెడల్‌ను కైవసం చేసుకుంది. తైపీ ఆర్చర్ ఓపెన్ 2025 టోర్నీలో కాంస్య పతకం గెలుచుకుంది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో కాంస్యం కోసం జరిగిన పోరులో కొరియాకు చెందిన చౌవోన్‌పై 149-143 తేడాతో సురేఖ విజయం సాధించింది. ఇప్పటికే ఆమె ఖాతాలో 26 వరల్డ్ కప్ మెడల్స్ ఉండగా.. అందులో 11 స్వర్ణ పతకాలు ఉన్నాయి.