రైతులకు అండగా ఉంటాం: కలెక్టర్

రైతులకు అండగా ఉంటాం: కలెక్టర్

BPT: రైతులకు అండగా ఉంటామని కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. శనివారం బాపట్ల పట్టణంలోని మార్కెట్ యార్డును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి యూరియా పంపిణీ తీరును పరిశీలించారు. రైతులు ఆందోళన చెందవద్దని, సకాలంలో యూరియా అందించే విధంగా చర్యలు చేపడతామని భరోసా కల్పించారు. యూరియా పంపిణీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులపై చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.