'Google Gemini' వాడుతున్నారా జాగ్రత్త..!

KNR: 'Google Gemini' ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ వెబ్‌సైట్‌లో మన ఫొటోలు అప్‌లోడ్ చేస్తే 3D వెర్షన్‌లో అందమైన ఫొటోలను రెడీ చేసి ఇస్తుంది. అయితే దీన్ని సైబర్ నేరగాళ్లు ఆసరాగా చేసుకునే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదే పేరుతో నకిలీ వెబ్‌సైట్ సృష్టించి డబ్బు కాజేస్తారని, ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.