గ్రంథాలయాలు దేవాలయాలు: ఏఎస్పీ

గ్రంథాలయాలు దేవాలయాలు: ఏఎస్పీ

KMR: గ్రంథాలయాలు దేవాలయం లాంటివని జిల్లా అడిషనల్ ఏఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఎంతోమంది విద్యార్థులకు, నిరుద్యోగులకు గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలనన్నారు.