నల్గొండలో నల్లజెండాలతో నిరసన
NLG: అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నల్లగొండలోని సుభాష్ సెంటర్‌లో నల్లజెండాలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మల్లం మహేష్, శంకర్ మాట్లాడుతూ.. అమెరికా యుద్ధాలను ప్రోత్సహిస్తూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తోందని, ఇరాన్‌పై దాడులకు ఇజ్రాయిల్‌ను ఉసిగొల్పుతోందని విమర్శించారు. మోడీ విధానాన్ని వారు తప్పుపట్టారు.