గ్రీన్ బోర్డులు అందజేసిన ఎమ్మెల్యే

NGKL: ప్రభుత్వ పాఠశాలలకు 31 గ్రీన్ బోర్డులను ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఆయన సతీమణి సరిత ఆధ్వర్యంలో కూచుకుళ్ల ఫౌండేషన్ పంపిణీ చేసింది. విద్యార్థుల్లో విద్యా పట్ల ఆసక్తి పెంచడం దీని లక్ష్యమని అన్నారు. అలాగే, శారీరక అంగవైకల్యం ఉన్నవారికి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి వీల్‌చైర్లను అందజేశారు.