ఢిల్లీ నుంచి సీఎం టెలీకాన్ఫరెన్స్

AP: CM చంద్రబాబు ఢిల్లీ నుంచి CS, DGPతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. లంక గ్రామాల ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 'సమస్య వచ్చాక కాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. ముందస్తు సన్నద్ధతతో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి. వరదలు, భారీ వర్షాలపై ప్రజల ఫోన్లకు సమాచారం పంపాలి. ఎరువుల కొరత సమస్య లేకుండా చూడాలి. ఎరువులు దారిమళ్లకుండా, ధర పెరగకుండా చూడాలి' అని అన్నారు.