'రాజకీయాలు పక్కన పెట్టి పరకాల అభివృద్ధికి సహకరించండి'

WGL: రాజకీయాలు పక్కన పెట్టి పరకాల పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మంగళవారం పరకాల మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాలలో భాగంగా అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. రాజుపేట, సీతారాంపురం తదితర ప్రాంతాలను ఎమ్మెల్యే పర్యటించారు.