జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

NLR: ఉలవపాడు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ప్రమాదంలో మండలంలోని వీరేపల్లి ఎస్టి కాలనీకి చెందిన చెంచయ్య మృతి చెందినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు... వీరేపల్లి జంక్షన్ వద్ద బైక్ పై ఊర్లోకి వెళ్తున్న చెంచయ్యను నెల్లూరు వైపు వెళుతున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన చనిపోయారు.