VIDEO: కురిచేడులో ఏపీటీయఫ్ కౌన్సిల్ సమావేశం

VIDEO: కురిచేడులో ఏపీటీయఫ్ కౌన్సిల్ సమావేశం

ప్రకాశం: కురిచేడులోని మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాజా రహంతుల్లా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ ఏపీటీఎఫ్ బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.