అన్న కాంటీన్లలో నాణ్యత పెంచాలి: కమిషనర్ మౌర్య

అన్న కాంటీన్లలో నాణ్యత పెంచాలి: కమిషనర్ మౌర్య

TPT: తిరుపతి నగరంలోని అన్న కాంటీన్లలో మరింత నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఎన్. మౌర్య సూచించారు. కాంటీన్ల నిర్వహణపై అధికారులు, కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించి దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని కోరారు. నూతనంగా 70 కాంటీన్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.