'హైరిస్క్ కేసులను ముందుగానే గుర్తించాలి'

'హైరిస్క్ కేసులను ముందుగానే గుర్తించాలి'

GDWL: గర్భిణీలలో హైరిస్క్ కేసులను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ బి.యం. సంతోష్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆయన ఒంటల పేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మికంగా పరిశీలించారు. వైద్యుల హాజరు, ఓపీ నమోదు, సిబ్బంది హాజరు, ప్రసవాల సంఖ్య, వ్యాక్సినేషన్ అమలు, మందుల లభ్యత వంటి అంశాలను సమీక్షించి తగిన సూచనలు జారీ చేశారు.