VIDEO: అల్లూరిలో భూప్రకంపనలు
VSP: ఏపీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా అల్లూరి వాసులను భూకంపం వణికించింది. భారీ శబ్దాలతో భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జీ మాడుగులలోని జగ్గాలమెట్టలో ఓ ఇంటి గోడ కూలిందని గిరిజనులు తెలిపారు. అయితే భూమి లోపల 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని NCS అధికారికంగా నిర్ధారించింది.