VIDEO: వేసవి దృష్ట్యా ఉచిత మజ్జిగ పంపిణీ
కృష్ణా: గుడివాడ బంటుమిల్లి రోడ్డులో స్థానికులు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు ఏడీఏ కవిత, ఏంఏవో అనంతలక్ష్మీ శుక్రవారం ప్రారంభించారు. వేసవికాలం దృష్ట్యా ప్రజలకు ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేసిన నిర్వాహకులను వారు అభినందించారు.