మున్సిపల్ సమస్యల పరిష్కారానికి వినతిపత్రం అందజేత

మున్సిపల్ సమస్యల పరిష్కారానికి వినతిపత్రం అందజేత

KMM: కల్లూరు మున్సిపాలిటీలో నెలకొన్న డంపింగ్ యార్డ్ సమస్య, సిబ్బంది వేతనాల చెల్లింపుపై మున్సిపల్ ఛైర్మన్ ధరావత్ మోహన్ శుక్రవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి వినతిపత్రం అందజేశారు. గత 8 నెలలుగా కార్మికులకు వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పారిశుద్ధ్య నిర్వహణకు ఆటంకం కలుగకుండా తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆయన కోరారు.