టిప్పర్ డ్రైవర్ మద్యం తాగలేదు: వైద్యులు
TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రోడ్డు ప్రమాదం ఘటనలో మృతి చెందిన టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు గుర్తించారు. డ్రైవర్ మహారాష్ట్రకు చెందిన ఆకాష్ కాంబ్లీగా గుర్తించి.. మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంబులెన్స్‌లో నాందేడ్‌కు తరలించారు. మరోవైపు, డ్రైవర్ మృతదేహానికి పరీక్షలు నిర్వహించిన ఫోరెన్సిక్ వైద్యులు.. మద్యం తాగలేదని నిర్ధారించారు.