అనధికార భవనాల క్రమబద్దీకరణకు దరఖాస్తులు స్వీకరణ
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ కీలక ఆదేశాల జారీ చేశారు. నగరంలో 1985 నుంచి ఆగస్టు 31, 2025 లోపు నిర్మించిన అనధికార భవనాలను క్రమబద్ధీకరణ చేయుటకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని GVMC ముఖ్య పట్టణ ప్రణాళికాధికారి ఎ. ప్రభాకర రావు మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన BPS సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.