ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉపాధ్యాయుడు మోహన్ రెడ్డి

నెల్లూరు: జిల్లాలోని వరికుంటపాడు మండలం రామదేవులపాడులో జరిగిన వైసీపీ ప్రచారంలో ప్రభుత్వ టీచర్ పాల్గొన్నారు. వింజమూరు మండలం నందిగుంట ఎంపీయూపీ పాఠశాలలో మోహన్ రెడ్డి టీచర్‌గా పని చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రచారాల్లో పాల్గొన వద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయినప్పటికీ కొందరు ఇలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.