రూ.11.50 లక్షల CMRF చెక్కులు పంపిణీ

KDP: మైదుకూరు నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు MLA పుట్టా సుధాకర్ యాదవ్ రూ.11.50 లక్షల CMRF చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలోని 20 మందికి ఈ చెక్కులు అందినట్లు ఆయన పేర్కొన్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో ఈ నిధులు అందజేసినట్లు ఆయన తెలిపారు.