కుష్టు వ్యాధి గుర్తింపుపై ఇంటింటా సర్వే
ATP: జిల్లాలో కుష్టు వ్యాధిపై ఉన్న అపోహల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, వ్యాధి సోకిన ప్రతి వ్యక్తిని గుర్తించి చికిత్స అందించాలని జిల్లా లెప్రసి ఎయిడ్స్ & టీబీ అధికారి జయలక్ష్మి.. ఏఎన్ఎంలకు సూచించారు. సోమవారం అనంతపురం నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో ఏఎన్ఎంలు ఇంటింటికి తిరిగి చేస్తున్న సర్వేను ఆమె తనిఖీ చేశారు.