ఎక్కడా రాజీ పడొద్దు: చంద్రబాబు
AP: సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలపై చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలందించాలని ప్రభుత్వ శాఖలకు సూచించారు. సమాచార మాధ్యమాల్లో వివిధ అంశాలపై స్పందించి చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజలకు సంబంధించిన అంశాల్లో ఎక్కడా రాజీకి అవకాశం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.