'విద్యార్థులు చదువుల్లో రాణించాలి'

ASF: విద్యార్థులు ఆరోగ్యంపై దృష్టి సారించి చదువుల్లో రాణించాలని కలెక్టర్ వెంకటేష్ ధౌత్రే సూచించారు. ఈ సందర్భంగా శుక్రవారం గిన్నెధారిలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన వసతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.