అన్న క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
PPM: కలెక్టరేట్ దగ్గరలో ఉన్న అన్న క్యాంటీన్‌ను కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ భోజనం చేస్తున్న వారితో మాట్లాడి భోజనం ఎలా ఉంది, కూరలు బాగున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. చాలా దూరం నుండి పనుల నిమిత్తం వచ్చామని బైట హోటల్లో భోజనం చేస్తే రూ.80 తీసుకుంటున్నారన్నారు.