చింతాడపేటలో మాజీ కేంద్రమంత్రి జన్మదిన వేడుకలు
SKLM: మహనీయుడు మాజీ కేంద్రమంత్రి మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే కింజరాపు ఎర్రన్నాయుడు అని కోటబొమ్మాళి ఏఎంసీ డైరెక్టర్ చింతాడ భీమారావు అన్నారు. సోమవారం 69వ జయంతి సందర్భంగా సంతబొమ్మాళి మండలం చింతాడపేటలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బలహీనవర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేసి రాజకీయాలలో విలక్షణమైన నాయకుడిగా పేరు పొందారని అన్నారు.