మహాశివుడి రుద్ర హోమం
VKB: దక్షిణ భారతదేశ ఏకశిలా పర్వతంగా ప్రసిద్ధి చెందిన శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా రుద్రహోమం వైభవంగా నిర్వహించారు. భక్తులు మహాశివుడికి అభిషేకాలు, అర్చనలు జరిపారు. హోమం అనంతరం భక్తులు శివనామ స్మరణతో గిరి ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.