BRS సభకు భారీగా విరాళం ఇచ్చిన జిల్లా వాసులు

ADB: అన్ని రంగాల్లో అండగా నిల్చిన ముక్రాకే గ్రామం మరోసారి తన ఉదారతను చాటుతుంది. బీఆర్ఎస్ హయాంలో దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిన ఆ గ్రామమే నేడు బీఆర్ఎస్ వేడుకల నిర్వహణకు స్వచ్ఛందంగా విరాళాన్ని అందజేసి, ఆదర్శంగా నిలిచింది. ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామస్థులు ఏప్రిల్ 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రూ. 1,02,003 విరాళం ఇచ్చారు.