ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన ఎంపీడీవో
ADB: 99 రోజుల 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా సోమవారం బోథ్ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలను ఎంపీడీవో రమేష్ తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, వంటశాల, తరగతి గదులను పరిశీలించి శుభ్రంగా ఉండేటట్లు చూడాలని వార్డెన్‌కు సూచించారు. ఈ క్రమంలో విద్యార్థులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు.